Wednesday, April 30, 2025
HomeUncategorized‘భూ భారతి’ రైతులకు న్యాయం చేస్తుంది: మంత్రి పొన్నం

‘భూ భారతి’ రైతులకు న్యాయం చేస్తుంది: మంత్రి పొన్నం

నవతెలంగాణ – హైదరాబాద్: ధరణి సమస్యలను భూ భారతి  అధిగమిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్  తెలిపారు. గురువారం హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండల కేంద్రంలో కొత్త ఆర్‌ఓఆర్ చట్టం భూ భారతి – 2025 పై రైతు అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. భూమి అంటే ఒక ఆత్మగౌరవం, పేగు సంబంధం, గుర్తింపు అని  అన్నారు. రాష్ట్రంలో దాదాపు 40 లక్షల మంది రైతులు ధరణి పేరు మీద భూ సమస్యలు ఏర్పడ్డాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారని అన్నారు. గత ఏడాది నుంచి భూమీ పంచాయతీల పిటీషన్‌లు వచ్చాయని, ఏ సమస్యతోటి ఆ పిటీషన్‌లు వచ్చాయో వాటిని పరిష్కరించామన్నారు. మన భూమికి గుర్తింపు, రికార్డు ఉండాలనే భూ భారతి చట్టం తీసుకు వచ్చినట్లు తెలిపారు. ఈ చట్టం భూ వివాదాలను పరిష్కరిస్తుందని స్పష్టం చేశారు. సమస్య పరిష్కారానికి కింద స్థాయి నుంచి అధికారులను బతిమి లాడుకోవడం, కోర్టుల చుట్టూ తిరగడం వంటివి మారాలని భూ భారతి తెచ్చినట్లు వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img