Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంపరిశ్రమను సందర్శించిన అయిల్ఫైడ్ ఎండీ శంకరయ్య..

పరిశ్రమను సందర్శించిన అయిల్ఫైడ్ ఎండీ శంకరయ్య..

- Advertisement -

మొదటి సారే ఆకస్మిక పర్యటన…
నవతెలంగాణ – అశ్వారావుపేట
: ఆయిల్ఫెడ్ ఎండీ శంకరయ్య శుక్రవారం స్థానిక ఫాం ఆయిల్ పరిశ్రమను సందర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన కలెక్టర్ లు,ఇతర అధికారుల బదిలీల్లో భాగంగా ఆయిల్ ఫెడ్ ఎండీ గా శంకరయ్య ను ప్రభుత్వం ఆదేశించింది. ఆయిల్ ఫెడ్ లో బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మొదటి సారిగా ఈ ప్రాంతంలోని ఆ సంస్థ కార్యకలాపాలను పరిశీలించేందుకు ఆకస్మికంగా పర్యటించారు. ముందుగా దమ్మపేట మండలం అప్పారావుపేట పామాయిల్ పరిశ్రమను సందర్శించారు.ఫ్యాక్టరీ లో ఆయిల్ ఫాం గెలల క్రషింగ్, క్రూడాయిల్ సేకరణ,నిల్వ,గెలల క్రషింగ్ ద్వారా లభించే ఉప ఉత్పత్తులను పరిశీలించారు. ఉప ఉత్పత్తులు,వాటి ప్రాధాన్యత,రైతులకు ఏ విధంగా ప్రయోజనం కలుగుతుందో పీ అండ్ పీ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి వివరించారు.అక్కడ నుండి అశ్వారావుపేట ఫ్యాక్టరీకి చేరుకున్నారు.ఫ్యాక్టరీ సామార్థ్యం,గెలలు సేకరణ, షవర్ ప్లాంట్ పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం నారంవారిగూడెం లో అయిల్పాం నర్సరీ ని సందర్శించారు.నర్సరీలో మొక్కలు పెంపకం,నాణ్యతా ప్రమాణాలు,రైతులకు ప్రభుత్వం అమలు చేస్తున్న రాయితీలు,ప్రభుత్వ పధకాల పై ఆరా తీశారు. ఆయన వెంట ఓఎస్డీ డా.కిరణ్ కుమార్,ఆయిల్ ఫెడ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్చార్జి నాయుడు రాధాకృష్ణ, అశ్వారావుపేట, అప్పారావుపేట ఫ్యాక్టరీ మేనేజర్లు నాగబాబు,కళ్యాణ్ గౌడ్ లు ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad