Wednesday, August 27, 2025
E-PAPER
spot_img
Homeసోపతిరాళ్లు మాట్లాడుతాయి

రాళ్లు మాట్లాడుతాయి

- Advertisement -

ఎక్కడో శిధిలమైన శిల
చరిత్ర చెపుతుంది
చెక్కబడిన శిల శిల్పమై
మూర్తిత్వాన్ని ప్రదర్శిస్తుంది!
రాళ్లతో కట్టిన సేతు
రామాయణాన్ని గుర్తుచేస్తుంది
శాసనాలు చెక్కిన శిలలు
రాచరికాలను గుర్తుతెస్తాయి!
మన నాయకులు వేసిన శిలాఫలకాలు
నిద్ర లేవని పథకాలను తెలియచేస్తాయి
ఆ రాముడెవ్వరో ఎప్పుడొస్తాడో
ఆ కాలి సోకి పథకాలు నిద్రలేవాలి!
పాలకుల వేదికలపై పలుకులు
పనికిరావని తెలిసినపుడు
రాళ్లు మాట్లాడుతాయి
మనసున్న ప్రజలు రాళ్లు కాదని!
ఎగురొచ్చి నినదిస్తాయి
ఎదురొచ్చి నిలదీస్తాయి
మేము సంఘటితమయితే
మీకు సమాదే అని!
ప్రజలు నోళ్లతో కాదు
రాళ్ళతో మాట్లాడుతారు!
రాళ్ళు మాట్లాడతాయి….!!
– జగ్గయ్య.జి, 9849525802

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad