శూన్యం

శూన్యంబతకడం కోసం రాసినవి కొన్ని.
బతుకంటే ఏమిటో చెప్తు రాసినవి కొన్ని
చచ్చాక బ్రతికుండేలా రాసినవి కొన్ని.
ఎప్పటికీ చావులేని చావురాని రాతలు కొన్ని..!
జీవితపు కొలమాని కోణాల్లో
సంపూర్ణ కవిత్వమంటే
‘అన్నింటిలో’ అక్షర అడుగుతో అంకెల మలుపుతో
కాసేపైనా కాలం కాళ్లతో కలం కళ్ళు రాసే పయనం
పరిమళం ప్రభావం ప్రవాహం.
జీవితం మిస్టరీ/ హిస్టరీ
జీవితం సిగేచర్‌/ లిటరేచర్‌
జీవితం అనంతం/ శూన్యం
జీవితం జ్ఞానం/ అజ్ఞానం
జీవితం ప్రశ్న/ జవాబు
జీవితం ఫిలాసఫీ/ థెరపీ
జీవితం ఫిజిక్స్‌/ లిరిక్స్‌
జీవితం ఆలోచన/ అన్వేషణ
జీవితం విశ్వం/ వికాసం
జీవితం స్వప్నం/ సత్యం
ఫిజిక్స్‌ అరుణ్‌ కుమార్‌, 9394749536న

Spread the love