Wednesday, August 19, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంభార‌త్ ప‌ర్య‌ట‌న‌లో మ‌య‌న్మార్ అధ్య‌క్షుడు

భార‌త్ ప‌ర్య‌ట‌న‌లో మ‌య‌న్మార్ అధ్య‌క్షుడు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: మయన్మార్ అధ్యక్షుడు యు మిన్ ఆంగ్ లైంగ్ (U Min Aung Hlaing) బీహార్‌లోని బోధ్ గయకు చేరుకున్నారు. మయన్మార్ అధ్యక్షుడికి బీహార్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హస్నైన్ ఆయనకు స్వాగతం పలికారు.ఈ మేర‌కు శ‌నివారం ఎక్స్ వేదిగా విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్ల‌డించారు.

మే 30 నుండి జూన్ 2 వరకు మయన్మార్ అధ్యక్షుడి భార‌త్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. ప్రస్తుత అధ్యక్ష హోదాలో మిన్ ఆంగ్ హ్లైంగ్ భారతదేశాన్ని సందర్శించడం ఇదే మొదటిసారి. ఆయనతో పాటు క్యాబినెట్ మంత్రులు, సీనియర్ అధికారులు, ప్రముఖ వ్యాపారవేత్తలతో కూడిన ఒక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా చేరుకుంది.

నాలుగు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప్ర‌ధాని మోడీతో భేటీ కానున్నారు. ఇరు దేశాల అధినేత‌ల మ‌ధ్య‌ కీల‌క చ‌ర్చ‌లు జ‌ర‌గ‌నున్నాయి. రెండు దేశాలకు చెందిన సరిహద్దు భద్రత, అనుసంధానం (connectivity), ఇతర అంశాలకు సంబంధించిన అంశాల‌పై చ‌ర్చించ‌నున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -