నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ-చత్తీస్‌గఢ్ సరిహద్దులోని బీజాపూర్ జిల్లా ధర్మ తాళ్లగుడెం పరిధిలోని కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో 38 మంది మావోయిస్టులు మృతిచెందినట్టు తెలిసింది. గతవారం రోజులుగా కర్రెగుట్టలే లక్ష్యంగా భద్రతా దళాలు ఆపరేషన్ కరాగ్ చేపట్టిన విషయం తెలిసిందే. సుమారు 5,500 మందితో డీఆర్‌జీ బస్తర్ ఫైటర్ కోబ్రా, సీఆర్‌పీఎఫ్, ఎస్‌టీఎఫ్ సైనికులు భారీ కూంబింగ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో నేడు జరిగిన ఎదురు కాల్పుల్లో సుమారు 38 మంది నక్సలైట్లు మృతిచెందినట్లు సమాచారం అందింది. మృతుల సంఖ్య ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉందని తెలిసింది. కానీ, మావోల మృతిపై ఇప్పటివరకు అధికారులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్..
- Advertisement -
RELATED ARTICLES