Thursday, October 9, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఫొటో జర్నలిస్టు షేక్‌ మహబూబ్‌ బాషా ఆకస్మిక మృతి

ఫొటో జర్నలిస్టు షేక్‌ మహబూబ్‌ బాషా ఆకస్మిక మృతి

- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ఫొటో జర్నలిస్టుల సంఘం సంతాపం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

సీనియర్‌ ఫొటోజర్నలిస్టు షేక్‌ మహబూబ్‌ బాషా (56) ఆకస్మిక మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ఫొటో జర్నలిస్టుల సంఘం అధ్యక్షులు అనుమల్ల గంగాధర్‌, కార్యదర్శి కె.ఎన్‌.హరి, కార్యవర్గ సభ్యులు తమ సంతాపాన్ని తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 1969లో కర్నూల్‌లో పుట్టిన భాషా, ఫొటోజర్నలిస్టుగా 2002 లో హైదరాబాద్‌లో తన కెరీర్‌ మొదలు పెట్టారని తెలిపారు. హైదరాబాద్‌ మిర్రర్‌, వార్త, ఆంధ్ర ప్రభ, సూర్య, మన తెలంగాణ పత్రికలకు తన కెమెరాతో అద్భుతమైన చిత్రాలను అందించారని పేర్కొన్నారు. పనిలో ఎప్పుడూ రాజీ పడలేదనీ, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ దగ్గర ఫొటోగ్రాఫర్‌గా తను సేవలందించారని గుర్తు చేశారు. కొంత కాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నారనీ, నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మంగళవారం సాయంత్రం మృతి చెందారని తెలిపారు.బాషాకు భార్య, కుమార్తె షహనాజ్‌ (22), కుమారుడు షోయబ్‌ (21) ఉన్నారని పేర్కొన్నారు. ఆయన అంత్యక్రియలు బుధవారం ఉదయం అంబర్‌పేటలో జరగనున్నాయని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -