వేసవిలో అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అందులో ముఖ్యంగా వడదెబ్బ, డీహైడ్రేషన్, చర్మ, జీర్ణ సంబంధిత సమస్యలు సర్వసాధారణం. వేసవి తాపం నుంచి మన శరీరాన్ని కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. నీరు ఎక్కువగా తాగడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం, చల్లటి ప్రదేశాలలో ఉండటం, వడదెబ్బ నుంచి రక్షించే దుస్తులు ధరిం చడం వంటివి వేసవిలో తీసుకోవలసిన ముఖ్యమైన జాగ్రత్తలు. అయితే వేసవి కాలంలో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిదో తెలుసుకుందాం.
నీరు ఎక్కువగా తాగాలి:
డీహైడ్రేషన్ నివారించడానికి రోజూ రెండు నుంచి మూడు లీటర్ల నీరు తాగాలి. దాహం వేసినా, వేయకపోయినా నీరు తాగడం అలవాటు చేసుకోండి. వ్యాయామం చేసేటప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు నీరు ఎక్కువగా తీసుకోండి. నీటికి బదులు కొబ్బరి నీరు, మజ్జిగ, నిమ్మరసం వంటి పానీయాలు కూడా తీసుకోవచ్చు.
పండ్లు-కూరగాయలు:
పుచ్చకాయ, దోసకాయ, నారింజ, నిమ్మకాయ వంటి నీరు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని చల్లగా ఉంచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. కీరదోస, టమాటా, క్యారెట్ వంటి కూరగాయలు కూడా వేసవిలో తీసుకోవడానికి చాలా మంచివి.
తేలికపాటి ఆహారం:
సులభంగా జీర్ణమయ్యే అన్నం, పెరుగు, మజ్జిగ వంటి తేలికపాటి ఆహారం తీసుకోవాలి. వేయించిన ఆహారం, కొవ్వు పదార్థాలు, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి. ఇవి జీర్ణ వ్యవస్థపై భారం వేస్తాయి, వేడిని పెంచుతాయి. ఉదయం పూట అల్పాహారంలో పండ్లు, ఓట్స్, పెరుగు వంటివి తీసుకోవచ్చు.
జంక్ ఫుడ్ మానుకోండి:
వేసవిలో జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ వంటి వాటికి దూరంగా ఉండాలి. వీటిలో క్యాలరీలు ఎక్కువగా, పోషకాలు తక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి హాని చేస్తాయి.
ఇంట్లో తయారుచేసిన ఆహారం:
బయటి ఆహారం కంటే ఇంట్లో తయారుచేసిన ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వండి. ఇంట్లో తయారుచేసిన ఆహారం ఆరోగ్యకరమైనది తాజాది. బయటి ఆహారంలో కలుషిత పదార్థాలు ఉండవచ్చు
ఈ జాగ్రత్తలు తీసుకుందాం..
- Advertisement -