Sunday, November 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అర్బన్ కాలనీలో గ్రంథాలయం ఏర్పాటు చేయాలి

అర్బన్ కాలనీలో గ్రంథాలయం ఏర్పాటు చేయాలి

- Advertisement -

యండి. సలీం, డివైఎఫఐ  జిల్లా ఉపాధ్యక్షులు
షేక్ రియాజ్, అర్బన్ కాలనీ డవలప్మెంట్ అధ్యక్షులు
నవతెలంగాణ – భువనగిరి
: భువనగిరి పట్టణం అర్బన్ కాలనిలో నిరుపయోగకరంగ ఉన్న ప్రాధమిక పాటషాల భవనంలో భగత్ సింగ్ గ్రంథాలయం ఏర్పాటు చేయాలని డివైఎఫ్ఐ భువనగిరి పట్టణ కమిటి ఆద్వర్యంలో ఆదివారం సంతాకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు యండి. సలీం, అర్బన్ కాలనీ డవలప్ మెంట్ అధ్యక్షులు షేక్ రియాజ్ మాట్లాడుతు అర్బన్ కాలనీ ఆసియా ఖండంలోనే అతిపెద్ద కాలనీ అత్యధికముగా చదువుకున్న యువత నివసిస్తున్నారని తెలిపారు   . అర్బన్ కాలనిలో గ్రంథాలయం ఎర్పాటు చేయడం వలన పట్టణంలోని 15, 16, 1  వ వార్డు ప్రజలందరికి ఉపయోగం జరుగుతుందని అన్నారు. విజ్ఞానాన్ని పెంచుకోడానికి గ్రంథాలయం  లేకపోవడం వలన ఇబ్బందులు ఎదురుకుంటున్నారని తెలిపారు. నిరుపయోగంగా ఉన్న ప్రాథమిక పాఠశాల భవనంలో గ్రంథాలయం ఎర్పాటు చేస్తే పోటి పరిక్షలకు సిద్ధమయ్యే యువతకు చాలా ఉపయోగం జరుగుతుందని అన్నారు.  ఖాళీ స్థలంలో ఓపన్ జిమ్, వాలిబాల్ కోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాళ్ళపల్లి హరిష్, యండి. సాజిద్, సాయి కుమార్, జీవన్, ముబీన్  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -