నవతెలంగాణ – తంగళ్ళపల్లి : ట్రాక్టర్ యూనియన్ మండల నూతన అధ్యక్షునిగా చందా భాస్కర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తంగళ్ళపల్లి మండల ట్రాక్టర్ యూనియన్ ఎన్నికలు తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ట్రాక్టర్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు బొల్లి రామ్మోహన్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో మండల ట్రాక్టర్ యూనియన్ అధ్యక్షునిగా చందా భాస్కర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే ఉపాధ్యక్షులుగా బండి మల్లేశం, చింతలపల్లి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా బెంద్రం పవన్ రెడ్డి, కోశాధికారిగా నలువాల పూర్ణచందర్, సహాయ కార్యదర్శిగా యాదగిరి,ప్రభుదాస్, గంగారెడ్డి, ఆనంద్ మహేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన పాలకవర్గానికి గౌరవ అధ్యక్షులు బొల్లి రామ్మోహన్ శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం శుభాకాంక్షలు తెలిపి ట్రాక్టర్ యూనియన్, డ్రైవర్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు.
ట్రాక్టర్ యూనియన్ అధ్యక్షునిగా చందా భాస్కర్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES