నవతెలంగాణ -ముధోల్
ముధోల్ మండలంలోని బ్రహ్మంన్ గావ్ ఎత్తిపోతల పథకానికి మరమ్మతుల కోసం ప్రభుత్వం 5కోట్ల 88 లక్షల రూపాయల నిధులను ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ చొరవతో మంజూరు చేసిందని ముధోల్ మండల బీజేపీ అధ్యక్షుడు కోరిపోతన్న మంగళవారం రాత్రి ఒక్క ప్రకటనలో తెలిపారు. కోట్లాది రూపాయలతో అప్పట్లో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించినప్పటికి, గత పది సంవత్సరాల్లో అప్పటి ఎమ్మెల్యే విఠల్ రేడ్డి నిర్లక్ష్యం మూలంగా రైతంగానికి చుక్క సాగు నీరు అందలేదని ఆయన ఆరోపించారు. గతంలో లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించిన పరికరాలు చోరీకి గురైన పట్టించుకోకపోవడం తో ప్రభుత్వ ధనం వృధా అయ్యిందన్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే రామారావు పటేల్ గెలుపొందడంతో సాగునీటీకీ పెద్దపీటవేశారన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ మరమ్మతులకు నిధుల మంజూరు చేయాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అసెంబ్లీ లో గళం విప్పడంతో ప్రభుత్వం స్పందించి ఐదు కోట్ల 88 లక్షల రూపాయల నిధులను మంజూరు చేసిందన్నారు. రైతుల అభివృద్ధికి ఎమ్మెల్యే నిరంతరం కృషి చేస్తారని ఆయన తెలిపారు.
ఎమ్మెల్యే చొరవతో నిధులు మంజూరు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES