నవతెలంగాణ – పెద్దవూర
పెద్దవూర మండల కేంద్రం లోని కస్తూర్బా గాంధీపాఠశాల ను మండల విద్యాధికారి తరి రాము బుధవారం అకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్కూల్లో సుమారు నలభై నిమిషాల పాటుకలియ తిరుగుతూ అన్ని వివరాలను ఎస్ ఓను అడిగి తెలుసుకున్నారు.విద్యార్థులకు ఉపాధ్యాయులు చేస్తున్న బోధనా తీరును క్లాస్ రూమ్ లో విద్యార్థులతో పాటు కూర్చొని పరిశీలించారు.విద్యార్థులకు పెడుతున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అలాగే స్టోర్ రూమ్, కిచెన్ ,టాయిలెట్స్, వంట పాత్రలు ,కూరగాయలను రికార్డులు పరిశీలించి తగుచూచనలు చేశారు.విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరు కావాలని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు.వర్షాకాలం సీజనల్ వ్యాదులుసోకకుండా పాఠశాల పరిసరాలు, తరగతి గదులు,వంటగది పరిశుబ్రంగా వుంచు కోవాలని తెలిపారు
కస్తూర్బా స్కూల్ ను తనిఖీ చేసిన ఎంఈఓ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES