నవతెలంగాణ-ధర్మసాగర్
ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. బుధవారం మండలంలోని శాతంపల్లి గ్రామంలో ఆయన ఇంటింటికి తిరిగి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్బంగా ఇందిరమ్మ లబ్ధిదారులను కలిసి ఆయన మాట్లాడారు. సమయానికి బిల్లులు అందుతున్నాయా, ఏవైనా సమస్యలు ఎదురవుతున్నాయా అనే విషయాలను లబ్ధిదారులను, అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొన్ని ఇళ్లకు సాంకేతిక సమస్యల కారణంగా బిల్లులు రావడం లేదని లబ్ధిదారలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో ఎమ్మెల్యే సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించి లబ్ధిదారులకు వెంటనే బిల్లులు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన నిర్మాణం పూర్తి చేసేలా అధికారులు పర్యావేక్షించాలని అన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఎవరికీ ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వాల్సిన అవసరం లేదని లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకోవాలని మీకు బిల్లులు ఇప్పించే బాధ్యత నాదని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంపీడివో అనిల్ కుమార్, గృహ నిర్మాణ శాఖ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా చూడాలి : ఎమ్మెల్యే కడియం శ్రీహరి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES