Thursday, July 3, 2025
E-PAPER
Homeసినిమా'కౌలాస్‌ కోట'లో ఏం జరిగింది?

‘కౌలాస్‌ కోట’లో ఏం జరిగింది?

- Advertisement -

అద్వైత్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై మన ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ 24 క్రాఫ్ట్స్‌ సమర్పణలో మాదాల నాగూర్‌ నిర్మిస్తున్న చిత్రం ‘కౌలాస్‌ కోట’. పీఎస్పీ శర్మ దర్శకుడు. ఈ చిత్ర పోస్టర్‌ లాంచ్‌ వేడుకను ఫిల్మ్‌ ఛాంబర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత మాదాల నాగూర్‌ మాట్లాడుతూ, ‘తెలుగు తెరపైకి ఆసక్తికరమైన, అద్భుతమైన కథ రాబోతుంది. డైరెక్టర్‌ పీఎస్పీ శర్మతో కలిసి పనిచేయడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. రియల్‌ కోట ప్రాంగణంలోనే షూటింగ్‌ చేస్తాం. ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణను సంపాదించుకుంటుందని నమ్మకంగా చెబుతున్నాను’ అని అన్నారు. ‘స్టోరీ, స్క్రీన్‌ప్లే విషయంలో చాలా కష్టపడ్డాం. రచయిత ఎర్రా సంజీవరాజ్‌ ఈ కథను ప్రారంభించినప్పటి నుంచి ఎన్నో అంశాలపై పరిశీలన చేసి, కథా మాటలు అందించారు. ఈ సినిమాలో గ్రాంథికంతో పాటు ప్రజెంట్‌ పరిస్థితులకు అనుగుణంగా సన్నివేశాలు ఉంటాయి. నవరసాలతో పాటు వినూత్నత కలిగిన ఈ చిత్రం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది’ అని దర్శకుడు పీఎస్పీ శర్మ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -