Friday, July 4, 2025
E-PAPER
HomeNewsఅనుమతి లేని నిర్మాణాలపై చర్యలు 

అనుమతి లేని నిర్మాణాలపై చర్యలు 

- Advertisement -

పంచాయతీ కార్యదర్శి అన్వర్ అలీ 
నవతెలంగాణ – ముధోల్ 
: గ్రామపంచాయతీ అనుమతి లేని నిర్మాణాలపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ముధోల్ పంచాయతీ కార్యదర్శి అన్వర్ అలీ అన్నారు. మండల కేంద్రమైన ముధోల్ లోని గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడారు. ముధోల్ గ్రామంలో నూతనంగా నిర్మాణాలు చేపడుతున్న వారు  సరైన పత్రాలతో అనుమతి కొరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం క్షేత్రస్థాయిలో పరిశీలించి, అనుమతి ఇచ్చిన తర్వాతనే ఇంటి నిర్మాణాలను ప్రారంభించాలని తెలిపారు.  అనుమతి లేని నిర్మాణాలు చేపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, వాటిని గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటికె తమ సిబ్బంది వార్డుల వారీగా అనుమతి లేని నిర్మాణాలను గుర్తించి జాబితాను సైతం సిద్ధం చేసినట్లు తెలిపారు. నిబంధనలు పాటించి, పంచాయతీ అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -