Friday, July 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఓటరు నమోదు.. సవరణలో బీఎల్ఓలే కీలకం 

ఓటరు నమోదు.. సవరణలో బీఎల్ఓలే కీలకం 

- Advertisement -

నవతెలంగాణ – దుబ్బాక : నూతన ఓటరు నమోదు, ఓటర్ కార్డులో తప్పుల సవరణ, మరణించిన వారి పేర్ల తొలగింపు వంటి ప్రక్రియలో బీఎల్ఓ (బూత్ లెవెల్ ఆఫీసర్) లే కీలకమని, ఇందులో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పక్కా ప్రణాళికతో బీఎల్ఓ లకు మాస్టర్ ట్రైనర్లు మధుసూదన్, ఉమాశంకర్, శ్రీనివాస్ లతో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తహశీల్దార్ ఈ.సంజీవ్ కుమార్ చెప్పారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గురువారం దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ఐఓసీలో ఏర్పాటుచేసిన దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని బీఎల్ఓ ల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

ఈనెల 3 నుంచి 17 వరకు అన్ని మండలాల్లో బీఎల్ఓ లకు తేదీల వారీగా షెడ్యూల్ ప్రకటించి శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా బీఎల్ఓ లకు ఆన్ లైన్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తామని, పకడ్బందీగా ఓటర్ లిస్ట్ ను తయారు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రవికుమార్, ఆర్ఐ హరికిషన్ రెడ్డి, రెవెన్యూ సిబ్బంది, బూత్ లెవల్ ఆఫీసర్లు, పలువురు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -