కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు శివరాజ్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ : సిద్దిపేట జిల్లా కేంద్రంతో పాటు హుస్నాబాద్ పట్టణంలోని అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రయివేట్ పాఠశాలలపై చర్యలు తీసుకొని గుర్తింపును రద్దు చేయాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు శివరాజ్ జిల్లా కలెక్టర్ కు గురువారం హుస్నాబాద్ లో వినతి పత్రం ఇచ్చారు. ప్రయివేట్ స్కూల్లో జరుగుతున్న ఫీజుల దోపిడి పై కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు.
ప్రయివేట్ పాఠశాలల లోనే పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, టైలు, బెల్టులు,అధిక ఫీజులకు విక్రయిస్తున్నారని, విద్యార్థుల తల్లిదండ్రులకు మోసం చేస్తున్నారని, ఎలాంటి విద్యా ప్రమాణాలు పాటించడం లేదని వివరించారు. ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా తమ ఇష్టానుసారంగా, వ్యాపారమే ధ్యేయంగా ప్రయివేట్ స్కూల్ యాజమాన్యలు వ్యవహరిస్తున్నాయని తెలిపారు. ఫీజుల కట్టడిపై పై చర్యలు చేపట్టాలని కలెక్టర్ ను కోరారు. జిల్లా వ్యాప్తంగా ప్రయివేట్ స్కూల్స్ పై తనిఖీలు చేపట్టే విధంగా జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించాలని కోరారు.