నవతెలంగాణ – జుక్కల్ : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆర్బిఎస్ వైద్యుడు విక్రమ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. మండలంలోని పడంపల్లి గ్రామంలోని యుపిఎస్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు గురువారం ఆర్ బి ఎస్ వైద్యుడు డాక్టర్ విక్రమ్ వైద్య పరీక్షలు నిర్వహించారు . విద్యార్థుల బరువు , ఎత్తు కొలవడం జరిగింది. ఎత్తుకు తగ్గట్టు పరువు ఉండాలని విద్యార్థులు పౌష్టికాహారం తీసుకోవాలని ప్రతి ఒక్కరూ వేడి వడి ఆహార పదార్థాలు పూజించాలని సూచించారు.
పౌష్టికాహారం లోపం ఉంటే పెరుగుదల , బరువు తగ్గుతాయ ని విద్యార్థులకు అవగాహనపరిచారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆదేశాల మేరకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు చొరవ తీసుకుని పేద విద్యార్థులకు వైద్య సమస్యలు రాకుండా రోగాల బారిన పడకుండా ముందస్తుగా ప్రభుత్వ పాఠశాల లను కచ్చితంగా వైద్య పరీక్షలు ముందస్తుగా నిర్వహించాలని సూచించారని అందుకే పాఠశాల విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం సవిత , ఫార్మసిస్ట్ కవిత, ఆశ వర్కర్ భాగ్యశ్రీ, , అంగన్వాడి టీచర్ లక్ష్మీబాయి పటేల్, పాఠశాల హెచ్ఎం లాలయ్య , ఉపాధ్యాయ బృందం , వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES