Friday, July 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జులై 9న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి: సీఐటీయూ

జులై 9న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి: సీఐటీయూ

- Advertisement -

సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్
నవతెలంగాణ – కంఠేశ్వర్ : కేంద్ర ప్రభుత్వం అమలు చేయడానికి సిద్దమైన నాలుగు లేబర్ కోడ్ లను తక్షణమే రద్దు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ అన్నారు. 29 కార్మిక చట్టాల అమలుకు సమరశీల పోరాటాలు తప్పవని, దానిలో భాగంగానే జులై 9 న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె ను జయప్రదం చేయాలని ఈ సందర్బంగా పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం సిఐటియు జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. బ్రిటిష్ కాలంలోనే కార్మికులు తమ న్యాయమైన సమస్యల పరిష్కరానికి,కార్మిక భద్రథ కి,సంక్షేమానికి అనేక పోరాటాలు చేసి కార్మిక చట్టాలను సాధించుకున్నారని అన్నారు. కార్మిక చట్టాలని కరోనా కాలంలో మోడీ ప్రభుత్వం ముజువాణి ఓటుతో పార్లమెంట్ లో మార్పులు చేసి నాలుగు లేబర్ కోడ్ లను తీసుకువచ్చారని అన్నారు. కార్పొరేట్ యాజమాన్యాలను సంతృప్తి పరచడానికి, వారి ఆదాయాలను మరింత రెట్టింపు ఛేయడానికి, కార్మిక వర్గం రక్తాన్ని పీల్చి పిప్పి చేయడానికి నాలుగు లేబర్ కోడ్ లను మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు.
ఈ కార్యక్రమంలో గంగాధర్, నరేష్, మహేష్, జాదవ్ మురళి , ప్రభాకర్, నవీన్ కుమార్ , ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -