నవతెలంగాణ – ముధోల్
ఈ నెల 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బొమ్మేన సురేష్, వ్వవసాయ కార్మిక సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం నూతన్ కూమార్ లు కోరారు. నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో డిలాక్స్ ఫంక్షన్ హాల్ లో సీఐటీయూ ముధోల్ నియోజక వర్గ స్థాయి సమావేశం గురువారం నిర్వహించారు. నియోజకవర్గం పరిధిలో సీఐటీయూ అనుబంధం సంఘాల్లో కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సందర్భంగా కార్మికుల సత్తా చాటాలని వారు పిలుపునిచ్చారు. సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం కలిసి సమ్మె నిర్వహించబోతున్నట్లు తెలిపారు. శతాబ్ద కాలంగా కార్మికవర్గం అనేక త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చి వాటి అమలుకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని వారు ఆరోపించారు. ఈ చర్యలు భారత రాజ్యాంగం లో ఆర్టికల్ 19(1),ఆర్టికల్ 21,24,39(డి)కి విరుద్ధమైనదని వారు పేర్కొన్నారు. కోడ్స్ అమలు జరిగితే కార్మిక సంఘాల ఏర్పాటు కష్టతరం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల సమష్టి బేరసారాల శక్తి నిర్వీర్యం చేయబడుతుందని, సమ్మె హక్కును సైతం లేకుండా చేస్తుందన్నారు.
ఉద్యోగ భద్రత, ఉపాధి భద్రత కోల్పోతారుని వాపోయారు. మేలో దేశ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని 2025 మే 20 జరగవలసిన సమ్మెను 2025 జూలై 9 కి మార్పు చేసిందన్నారు. జులై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను కార్మికులు పెద్ద ఎత్తున హాజరై కార్మికుల సత్తా చాటాలని వారు కోరారు. సిఐటియు జిల్లా అధ్యక్షురాలు గంగమణి మాట్లాడుతూ.. కార్మికుల కనీసం అయితే రూ.26 వేలఇవ్వాలని, మన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. లేబర్ కోడ్ చట్టాలు రద్దు చేయాలని, గ్రామపంచాయతీ కార్మికుల 3 నెలల పెండింగ్ జీతం విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు గంగమణి, ఆశ వర్కర్ జిల్లా అధ్యక్షులు బి సుజాత, ఆశ వర్కర్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు విజయ,ముధోల్ నియోజక వర్గ అధ్యక్షలు ఇంద్రమాల,కార్యదర్శి సరిత, నాయకులు నందా,మౌనిక, విజయ, తెలంగాణ అంగన్వాడీ యూనియన్ సీఐటీయూ ప్రాజెక్ట్ అధ్యక్షురాలు రజియా,కార్యదర్శి రేష్మ, గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ డివిజన్ అధ్యక్షుడు రమేష్, కార్యదర్శి దేవరావు, ఉపాధ్యక్షులు నాగేష్, రాజు సతీష్ రతన్ సాయినాథ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు నాగపూర్ తిరుపతి,ముధోల్ నాయకుడు గంధం, లింగన్న, తదితరులు పాల్గొన్నారు.
దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి: సీఐటీయూ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES