Saturday, July 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ విద్యారంగ సమస్యల పరిష్కారానికై ఎమ్మెల్యేకు వినతి 

ప్రభుత్వ విద్యారంగ సమస్యల పరిష్కారానికై ఎమ్మెల్యేకు వినతి 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ : భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ , ఫీజ్ రియంబర్స్మెంట్స్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం బకాయిలను విడుదల చేసే రకంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ శాసనసభ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పెద్ది సూరి మాట్లాడుతూ.. గత మూడు సంవత్సరాల నుండి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం వలన ఎస్సీ ఎస్టీ పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

అలాగే స్కాలర్షిప్ మరియు ఫీజు నెంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వలన లక్షల మంది విద్యార్థులు ఉన్నత చదువులకు మరియు ఉద్యోగాలకు వెళ్లడానికి అవసరమగు సర్టిఫికెట్స్ ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల దగ్గర ఉండటం వలన వారు అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోతున్నారు. అదేవిధంగా దేశం అభివృద్ధి చెందాలంటే విద్యారంగాన్ని బలోపేతం చేయడం వల్లనే సాధ్యమవుతుందని చరిత్ర చెబుతున్నా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కనీసం విద్యాశాఖకు మంత్రిని కూడా కేటాయించకుండా ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తుందని అన్నారు.

అదేవిధంగా నిజామాబాద్ నగరంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు చిన్నపాటి వర్షానికి చెరువులను తలపించే రకంగా చాలా దీన స్థితిలో ఉన్నాయని ఈ సమస్యల తీవ్రతను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ ప్రభుత్వ విద్యారంగ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పెండింగ్లో ఉన్న బకాయిల విడుదల చేయాలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో యూఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి పోషమైన మహేష్ నాయకులు మారుతి,వేణుతదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -