మనిషిని శవంగా మార్చే మారణకాండ కాదు మతం.ముత్తయిదువు నుదుట చెరిచే కుంకుమ కాదు మతం. కన్నతండ్రి ఆశలను పేల్చే తుపాకీ గుండు కాదు మతం.భవిష్యత్తు ప్రశ్నార్ధకమై అల్లాడేతనయుల రోదన కాదు మతం. కార్చిచ్చు రగిల్చే కన్నతల్లి గుండెకోత కాదు మతం.మురికి కుప్ప ల్లోంచి దూకేకుళ్లిన క్రూర ఆలోచనల దుర్వాసన కాదు మతం.కసిని కుమ్మరిస్తూరెచ్చగొట్టే వికృత చేష్టలు కాదు మతం.ప్రకృతిని దిగ్భ్రాంతికి గురిచేసే పైశాచిక ఆనందం కాదు మతం. అకారణంగా ప్రాణాలు తీసే ఆటవిక చర్య కాదు మతం.అల్లా పేరిట జరిగే ఉగ్రవాదం కాదు మతం.సోదర భావాన్ని చెరచిఐక్యతను సమాధి చేసే రుధిర క్రీడ కాదు మతం.మానవత్వం నిలువెల్లా తడిసిన ప్రేమతత్వం పేరు మతం.మనిషిని మనిషితో కలిపే సంపూర్ణత్వం కావాలి దాని రూపం.
– షేక్.నసీమాబేగం, 9490440865(పహల్గావ్ ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తూ)
ఏది మతం…?
- Advertisement -
RELATED ARTICLES