Saturday, July 5, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఅధునాతన సౌకర్యాలతో పోలీస్‌స్టేషన్‌ భవనాలు

అధునాతన సౌకర్యాలతో పోలీస్‌స్టేషన్‌ భవనాలు

- Advertisement -

– యువత మత్తుకు బానిసలై జీవితాలు నాశనం చేసుకోవద్దు : రాష్ట్ర డీజీపీ జితేందర్‌
– కొడంగల్‌ నియోజకవర్గంలో పోలీస్‌స్టేషన్‌ భవనాలకు శంకుస్థాపన
నవతెలంగాణ-కొడంగల్‌

ప్రజల సౌకర్యార్థం అధునాతన సౌకర్యాలతో పోలీస్‌ స్టేషన్‌ భవనాలు నిర్మిస్తున్నామని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీజీపీ) జితేందర్‌ అన్నారు. శుక్రవారం వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ నియోజకవర్గంలో రూ.10 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించే పోలీస్‌ స్టేషన్లకు పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ గుర్నాథ్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌, డీఐజీ తాప్సీర్‌ ఎగ్బాల్‌, ఎస్పీ నారాయణరెడ్డి, హౌసింగ్‌ ఐజీపీ రమేష్‌, కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డితో కలిసి పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో శంకుస్థాపనలు చేశారు. కొడంగల్‌ పోలీస్‌స్టేషన్‌కు రూ.2.96 కోట్లు, సర్కిల్‌ పోలీస్‌ స్టేషన్‌కు రూ.84.50 లక్షలు, దుద్యాల పోలీస్‌ స్టేషన్‌కు రూ.3 కోట్లు, బొంరాస్‌పేట్‌లో రూ.2.96 కోట్ల వ్యయంతో నిర్మాణాలు చేపట్టే పనులకు భూమిపూజ చేశారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ.. పోలీస్‌ స్టేషన్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మాదకద్రవ్యాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి మాదకద్రవ్యాల తరలింపుపై ప్రత్యేక నిఘాతో దోషులను గుర్తించడంతోపాటు చట్టరీత్యా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. యువత చెడు వ్యసనాలకు గురి కావడంతో కుటుంబాలు చెల్లాచెదురవుతున్నా యని అన్నారు. ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాల వినియోగంతో జరిగే అనర్ధాలను తెలుసుకుని తమ జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కడా ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డి, తాండూర్‌ సబ్‌ కలెక్టర్‌ ఉమా శంకర్‌ప్రసాద్‌, అసిస్టెంట్‌ ట్రైనీ కలెక్టర్‌ హర్ష్‌ చౌదరి, పరిగి డీఎస్పీ శ్రీనివాస్‌, తహసీల్దార్‌ విజయకుమార్‌, స్థానిక నాయకులు అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -