నవతెలంగాణ – తొగుట : పోలీసు సిబ్బంది శరికంగా, మానసికంగా దృఢంగా ఉండాలని తొగుట సీఐ ఎస్కే లతీఫ్ అన్నారు. శనివారం సిద్దిపేట సీపీ ఆదేశానుసారం వీక్లీ పరేడ్ లో భాగంగా తొగుట సర్కిల్ పరిధిలో సీఐ లతీఫ్ అధ్వర్యంలో పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిబ్బందికి పరేడ్ వల్ల క్రమ శిక్షణ, శారీరక ఫిట్నెస్ పెరుగుతుందన్నారు.
పోలీస్ స్టేషన్ కి వచ్చిన పిటిషనర్ తో మర్యాద పూర్వకంగా మాట్లాడాలని సూచించారు. బ్లూ కోల్ట్ సిబ్బంది ఎప్పుడు విజబుల్ పోలీసింగ్ చేస్తూ డయల్ 100 కాల్స్ కి వెంటనే స్పందించాలని తెలిపారు. పోలీసు సిబ్బంది అందరూ శారీకంగా, మానసికంగా దృఢంగా ఉండాలని అన్నారు. ఈ పరేడ్ లో తోగుట ఎస్ఐ రవికాంత్ రావు, కుకునూర్ పల్లి ఎస్ఐ శ్రీనివాస్, దౌలతాబాద్ ఎస్ఐ, ప్రెందీప్, బేగంపేట్ ఎస్ఐ, మహిపాల్ రెడ్డి, తొగుట సర్కిల్ కానిస్టేబులు తదితరులు పాల్గొన్నారు.