‘వెలుగుల వెనుక’ ఆవిష్కరణ సభ
వేల్పుల నారాయణ కథా సంపుటి ‘వెలుగుల వెనుక’ ఆవిష్కరణ సభ ఈ నెల 8వ తేదీ సాయంత్రం 5 గంటలకు రవీంద్రభారతి మొదటి అంతస్థులో జరుగుతుంది. తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘం, నవచేతన పబ్లిషింగ్ హౌస్, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ సభలో డా||పల్లేరు వీరస్వామి, ఆచార్య ఎస్వీ సత్యనారాయణ, చాడా వెంకటరెడ్డి, డా|| ఏటుకూరి ప్రసాద్, మామిడి హరికృష్ణ, బి.ఎస్.రాములు, ఎస్. మధుకర్, డా||కాలువ మల్లయ్య, ఆడెపు లక్ష్మీపతి, కె.పి.అశోక్‌కుమార్, కె.వి.ఎల్, ఏలేశ్వరం వెంకటేశం పాల్గొంటారు.
దాశరథి శతజయంతి సాహిత్య సదస్సు
కేంద్రసాహిత్య అకాడమీ, ప్రభుత్వ సిటీ కళాశాల సంయుక్త నిర్వహణలో జూలై 9 ఉదయం 10 నుండి సిటీ కళాశాల ఆజామ్ హాల్లో ‘దాశరథి శతజయంతి’ జరుగుతుంది. ఇందులో సి.మణాళిని, నందిని సిధారెడ్డి, పి.బాలభాస్కర్, శ్రీమతి ఇందిరా గౌరీశంకర్, కోయి కోటేశ్వరరావు, గండ్ర లక్ష్మణరావు, ఏనుగు నరసింహారెడ్డి, ఆర్ సీతారామ్, కె ప్రభాకర్, సిద్ధంకి యాదగిరి, సమ్మెట విజయ, గరిపెల్లి అశోక్, మామిడి హరికష్ణ, జె.నీరజ, కాకునూరి సూర్యనారాయణ మూర్తి, అవధానం సుజాత పాల్గొంటారు. – సి మణాళిని
రజనిశ్రీ సాహిత్య పురస్కార ప్రదానోత్సవ సభ
‘నిశాచరుడి దివాస్వప్నం’ కవితా సంపుటి రచించిన మల్లారెడ్డి మురళీమోహన్‌కు ఈ నెల 12 న మధ్యాహ్నం 1.30 గంటలకు రవీంద్రభారతిలో రజనిశ్రీ సాహిత్య పురస్కారం ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమంలో సి.పార్థసారథి, కసిరెడ్డి వెంకటరెడ్డి, మామిడి హరికష్ణ, ఆచార్య ఎస్. రఘు, అన్నవరం దేవేందర్, జి.వి.శ్యామ్ ప్రసాద్‌లాల్, మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్, పొన్నం రవిచంద్ర, డాక్టర్ గండ్ర లక్ష్మణరావు, వడ్లూరి ఆంజనేయరాజు, మావుడూరి సూర్యనారాయణమూర్తి, కేఎస్ అనంతాచార్య పాల్గొంటారు.
– గాజుల రవీందర్, అధ్యక్షులు
13న కార్టూనిస్ట్ శేఖర్ స్మారక అవార్డుల ప్రదానం
కార్టూనిస్ట్ శేఖర్ స్మారక అవార్డుల ప్రదానం ఈ నెల 13న ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో జరగనుంది. 2025 సం||కి కార్టూనిస్ట్ మత్యుంజయ, శ్రీ చిత్ర అవార్డులను అందుకోనున్నారు. ఈ సభలో ఎస్. వినయకుమార్, A Brush Against Prejudice: The Pro-people Art of Sekhar అనే అంశంపై కూర్మనాథ్ శేఖర్ స్మారకోపన్యాసం చేస్తారు. డాక్టర్ తిప్పర్తి యాదయ్య, చింతల యాదగిరి, శంకర్, కూరెళ్ళ శ్రీనివాస్, శ్రీమతి చంద్రకళా శేఖర్ పాల్గొంటారు. వివరాలకు : కంభాలపల్లి కష్ణ 9052116323
వెన్నెల సాహితీ పురస్కారం
వెన్నెల సాహితీ సంగమం, సిద్దిపేట. ఆధ్వర్యంలో 2023, 2024 సంవత్సరాలకు ప్రకటించిన కథా సంపుటాల పోటీలో శ్రీ ఊహ రచించిన కథా సంపుటి ‘బల్కావ్’ ఎంపికైంది.
– వెన్నెల సాహితీ సంగమం
సాహితీ సమాచారం
- Advertisement -
- Advertisement -