సాహితి స‌మాచారం

డా|| వి.చంద్రశేఖర రావు జయంతి సభ
ఈ నెల 13 సాయంత్రం 6 గంటలకు గుంటూరు 2/7 బ్రాడీపేట, కొరటాల భవన్‌లో డాక్టర్‌ వి.చంద్రశేఖర రావు జయంతి -పురస్కారం 2024 సభలో చరణ్‌ పరిమికి పురస్కారం అందజేస్తారు. ఈ సభలో పెనుగొండ లక్ష్మీ నారాయణ, పాపినేని శివశంకర్‌, వాసిరెడ్డి నవీన్‌,సీతారాం, ఎస్‌.స్పందన, కందిమళ్ళ శివప్రసాద్‌, వి.ప్రసూన, కాట్రగడ్డ దయానంద్‌ , పాల్గొంటారు. – డాక్టర్‌ వి.ప్రసూన
అక్కినేని జీవితం, నట జీవితంపై వ్యాసరచన, మినీకవితల పోటీ
సాంస్కృతిక బంధు సారిపల్లి కొండలరావు సౌజన్యంతో యువకళావాహిని- సాహితీకిరణం సంయుక్త ఆధ్వర్యంలో అక్కినేని శతజయంతి సందర్భంగా వ్యాసరచన, మినీకవితల పోటీ నిర్వహిస్తోంది. అంశాలు:1) అక్కినేని పౌరాణిక, భక్తి చిత్రాలు 2) అక్కినేని జానపద, చారిత్రాత్మక చిత్రాలు, 3) అక్కినేని సాంఘిక చిత్రాలు 4) అక్కినేని జీవిత వ్యక్తిత్వం. ప్రతి అంశానికి రెండు బహుమతులు: ప్రథమ 2500/-, ద్వితీయ 1500/-. అక్కినేని నటనపై 12లైన్లు మించకుండా మినీకవితలు పోటీలో 4 మినీకవితలకు ఒక్కొక్క కవితలకు రూ||1000/-. 2024లో అక్కినేని శతజయంతి వేడుకలలో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రదానం చేయబడును. వ్యాసాలు/మినీకవితలు పోస్టు/కొరియర్‌ ద్వారా మాత్రమే ఏప్రిల్‌ 30 లోపు సాహితీకిరణం, ఇం.నెం.11-13-154, అలకాపురి, రోడ్‌నెం.3, హైదరాబాద్‌-500102 చిరునామాకు పంపాలి. వివరాలకు :పొత్తూరి సుబ్బారావు, 9490751681.
శివేగారి దేవమ్మ కథా పురస్కారాలు – 2023
శివేగారి దేవమ్మ కథా పురస్కారాలు- 2023 సం.కోసం 2022-23 లో ప్రచురితమైన కథాసంపుటాలు, బాలల కథాసంపుటాలను ఆహ్వానిస్తున్నారు. ఎంపికైన ఉత్తమ కథా సంపుటానికి 7000/- , బాలల కథా సంపుటానికి 3000/- , పురస్కార వుంటుంది. సంపుటాలు మూడేసి ప్రతులు ఏప్రిల్‌ 20 లోపుK.V Meghanath Reddy, H.No.
11/21/01, N.G.O s colony, Puttur – 517583,Tirupathi (D), AP. చిరునామాకు అందేలా పంపాలి. వివరాలకు :కె.వి.మేఘనాథ్‌ రెడ్డి. 6300318230.
‘వీలునామా’ కవితలకు ఆహ్వానం
ప్రముఖ కవయిత్రి బైరి ఇందిరగార రాసిన ‘వీలునామా’ కవిత ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అందరికి సుపరిచితమే. ఆమె కోరిక మేరకు ‘వీలునామా’ కవితా సంకలనం తీసుకురావాలని వారి కుటుంబం, తెలంగాణ సాహితి రాష్ర ్ట కమిటీ భావించింది. ‘వీలునామా’ అనే అంశంపై రాసిన కవితలు ఏప్రిల్‌ 30వ తేదీలోపు indira.veelunama.gmail.com కు పంపగలరు.
– హిమజారామం, మోహన్‌కృష్ణ అనంతోజు, 8897765417

Spread the love