సాహితీ వార్తలు

మార్చి 3న నెల్లూరులో అక్షరోత్సవం
చిన్ని నారాయణరావు సాహితీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నెల్లూరు టౌన్‌ హాలులో మార్చి 3న ఉదయం 10 గంటలకు ‘అక్షరోత్సవం’ సాహితీ కార్యక్రమం జరగనుంది. ఇందులో తుంగా శివప్రభాత్‌ రెడ్డి, డా||నందమూరి లక్ష్మీపార్వతి, మాడభూషి సంపత్‌ కుమార్‌, శ్రీరామకవచం సాగర్‌, బీరం సుందరరావు పాల్గొంటారు. యాకుబ్‌కు అవార్డును, బంగార్రాజు కంఠకు, మల్లెతీగ కలిమిశ్రీకి సాహిత్య పురస్కారాలను అందజేస్తారు. కవి సమ్మేళనం, కవులకు ఆత్మీయ సత్కారం వుంటాయి.
మార్చి 3న జలకవనం
వేసవిలో తాగునీటి సమస్యలను దృష్టిలో కారణంగా కవిత్వం ద్వారా ప్రజలను చైతన్యం చేయాలని సాహితీ స్రవంతి అనంతపురం జిల్లా పెనుకొండలోని గగన్‌మహాల్‌ వేదికగా మార్చి 3వ తేది ఉ.10.30 గంటల నుండి రాత్రి 7.00వరకు నిరవధికగా జలకవనం నిర్వహిస్తున్నది. ఇందుకోసం కవులు, కళాకారులు తమపేర్లు నమోదు చేసుకోవచ్చు. వివరాలకు : 9491355200
మార్చి 3న కథా గౌరవ సభ
పల్లిపాలెం కథా గౌరవ సభ మధునాపంతుల కామరాజు సాంస్కతిక ప్రాంగణం. పల్లిపాలెంలో మార్చి 3వ తేదీ ఉదయం 10 గంటలకు జరుగుతుంది. ఇందులో ఆకుల మల్లేశ్వరరావు, తిరుపతి, అనిల్‌ డ్యానీ, భగవంతం, వంశీకష్ణ, మధునాపంతుల సత్యనారాయణ మూర్తి, కిరణ్‌ మధునాపంతుల పాల్గొంటారు. డా|| చింతకింది శ్రీనివాస రావు, శ్రీమతి ఎండపల్లి భారతికి కథా గౌరవ పురస్కారాలు అందజేస్తారు. వివరాలకు : 9704186544.
సైన్స్‌ ఫిక్షన్‌ నవలల పోటీకి పునరాహ్వానం!
విఠాల లలిత – కౌమార బాలల సైన్స్‌ ఫిక్షన్‌ నవలల పోటీకి నవలలు ఎక్కువగా రానందున గడువు పొడిగిస్తున్నారు. బహుమతుల విషయంలో కూడా కొన్ని ఆకర్షణీయమైన మార్పులు చేసి ప్రకటిస్తున్నారు. ఇదివరకే మాకు అందిన వాటి మార్పులు చేసి కూడా మళ్ళీ పంపవచ్చు. కౌమార బాలల సైన్స్‌ ఫిక్షన్‌ నవలలు పిల్లలూ, పెద్దలూ ఆసక్తిగా చదివేలా ఉండాలి. ఏ వయసు వారైనా 50- 60పేజీలలోపు పోస్టు/ కోరియర్‌ ద్వారా మాత్రమే ఆగస్టు 1వ తేదీ లోపు 304, ఎండికోస్‌ కౌంటి అపార్ట్మెంట్‌, జెక్‌ కాలని, వీధి నెం: 2, సనత్‌ నగర్‌ – 500018 చిరునామాకు పంపాలి. వివరాలకు – వి.ఆర్‌. శర్మ:9177887749.
కొలకలూరి పురస్కారాలు – 2024
శ్రీమతి కొలకలూరి భాగీరథీ కథానికా పురస్కారం – 2024 కు ఎంపికైన కథలు… 1. ‘కామునికంత’ (హుమయున్‌ సంఘీర్‌) 2. ‘కలుంకూరి గుట్ట’ (కె.వి. మేఘనాథరెడ్డి). ‘కొలకలూరి విశ్రాంతమ్మ నవలా పురస్కారం – 2024’ కు ఎంపికైన నవలలు 1. ‘అడవి బతుకులు’ (డా|| దిలావర్‌), 2. ‘నిర్మాల్యం’ (సింహప్రసాద్‌). ‘కొలకలూరి రామయ్య విమర్శన పురస్కారం – 2024’కు ఎంపికైనా విమర్శనాత్మక గ్రంథాలు : 1. ‘తాత్త్విక నేపథ్యంలో తెలుగు కవిత్వ పరిణామం’ (డా||సుంకిరెడ్డి నారాయణరెడ్డి), 2. ‘నవలా హదయం -3’ (వి. రాజారామమోహనరావు). ఈ నెల 26 వ తేదీ సాయంత్రం పురస్కార ప్రదాన సభ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం (నాంపల్లి, హైదరాబాద్‌)లో జరుగుతుంది.

Spread the love