నవతెలంగాణ – హైదరాబాద్: నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారం రాష్ర్టపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా అందుకున్న విషయం తెలిసిందే. ఈ అవార్డును అందుకోవడం పట్ల బాలకృష్ణ సంతోషం వ్యక్తం చేశారు. తన అభిమానులకు, భారత ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఈ అవార్డు ఎప్పుడో రావాల్సిందని కొందరు అభిమానులు అభిప్రాయపడుతుంటారని, అయితే తనకు సరైన సమయంలోనే పద్మభూషణ్ వచ్చిందని తాను భావిస్తున్నట్లు బాలకృష్ణ తెలిపారు.
- Advertisement -