Monday, July 7, 2025
E-PAPER
Homeతాజా వార్తలుహైకోర్టులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిటిషన్‌పై విచారణ పూర్తి..

హైకోర్టులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిటిషన్‌పై విచారణ పూర్తి..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై నమోదైన పరువు నష్టం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఆయన హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సోమవారం వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలను నమోదు చేసుకున్న న్యాయస్థానం, తుది తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలపై బీజేపీ నేత వాసం వెంకటేశ్వర్లు పరువు నష్టం కేసు దాఖలు చేశారు. కింది కోర్టులో విచారణలో ఉన్న ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన ధర్మాసనం, వాదనలు పూర్తవడంతో తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు వెల్లడించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -