నవతెలంగాణ – పరకాల : మున్సిపాలిటీ పరిధిలోని వార్డులలో ప్రజా సమస్యలను తెలుసుకోవడం కోసం ప్రతి సోమవారం డయల్ యువర్ కమిషనర్ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కడారి సుష్మ తెలిపారు. అందులో భాగంగా సోమవారం పరకాలలో ఆమె ఈ కార్యక్రమాన్ని సోమవారం లాంచనంగా ప్రారంభించారు. పట్టణానికి చెందిన సుమారు 15 మంది డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమంలో పాల్గొని వారి వారి వార్డులలో ఉన్న సమస్యలను వివరించారు.
ప్రజల నుంచి డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమానికి మంచి స్పందన ఉందని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. పరకాల మున్సిపాలిటీ పరిధిలో 22 వార్డులు ఉన్నాయని, ఆ వార్డులలో నిత్యం క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలను ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకునే అవకాశం జరుగుతుందన్నారు. పారిశుద్ధ్యం విద్యుత్తు మంచినీరు మురుగు కాలువల నిర్వహణ లాంటి ఎన్నో ఫిర్యాదులు డయల్ యువర్ కార్యక్రమంలో వెలుగులోకి వచ్చాయన్నారు. ప్రతి సోమవారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని కమిషనర్ ఈ సందర్బంగా స్పష్టం చేశారు.