Tuesday, July 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మెల్యేకు వినతి ప్రతం అందజేసిన సీపీఐ(ఎం) నాయకులు

ఎమ్మెల్యేకు వినతి ప్రతం అందజేసిన సీపీఐ(ఎం) నాయకులు

- Advertisement -

నవతెలంగాణ – వలిగొండ రూరల్ : మండల పరిధిలోని పులిగిల్ల గ్రామంలో సోమవారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) కార్యదర్శి బుగ్గ చంద్రమౌళి మాట్లాడుతూ.. పులిగిల్ల గ్రామంలో పునాది గాని కాలువ పనులు వెంటనే ప్రారంభించాలని కోరారు. పులిగిల్ల గ్రామంలో వ్యవసాయం సాగు చేయడానికి నీళ్లు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.

ఈ కాలువ ద్వారా పులిగిల్ల గరైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. పులిగిల్ల నుండి కేర్చుపల్లి వలిగొండ రోడ్డును వేయాలన్నారు. అదేవిధంగా గత ఆరు సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న పింఛన్లను వెంటనే అందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇండ్ల విషయంలో పులిగిల్ల గ్రామంలో జనాభా ఆధారంగా ఇండ్లను  కేటాయించాలని కోరారు. అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు వేముల నాగరాజు మాట్లాడుతూ.. గ్రామంలో అత్యంత యువత ఉన్నందున ఆటలు ఆడేందుకు క్రీడా ప్రాంగణం, గ్రంథాలయ ఏర్పాటు చేయాలని కోరారు.

ఎస్సీ కాలనీ వాసులకు స్మశాన వాటిక, వాటర్ సౌకర్యం కల్పించాలని కోరారు. కంచనపల్లి పులిగిల్ల రోడ్డు చేపట్టాలని ఎమ్మెల్యేను కోరారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించి, రానున్న రోజుల్లో ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో వడ్డమాను వెంకటయ్య, వేముల చంద్రయ్య, డివైఎఫ్ఐ జిల్లా నాయకులు వడ్డేమాన్ మధు, సీపీఐ(ఎం) నాయకులు కొమ్మిడి సత్తిరెడ్డి, వేముల అమరేందర్, మారబోయిన ముత్యాలు, బొడ్డు రాములు, దెయ్యాల నరసింహ, వేముల ప్రవీణ్, సందెల సాయిలు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -