నవతెలంగాణ – భిక్కనూర్ : రేపు జులై 9న జరిగే జాతీయ కార్మిక సమ్మెను జయప్రదం చేయాలని బి ఎల్ టి యు రాష్ట్ర అధ్యక్షులు సిద్ధ రాములు తెలిపారు. మంగళవారం భిక్కనూరు పట్టణ కేంద్రంలోని శివాజీ బీడీ కంపెనీలో సమ్మె నోటీసును మేనేజర్ కు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జాతీయ సమ్మెలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రంగాల కార్మికులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. కార్మిక చట్టాలను మోడీ ప్రభుత్వం రద్దుచేసి పెట్టుబడిదారులకు ఉపయోగపడే చట్టాలను తీసుకురావడం, కార్మికుల హక్కులను కాలరాసే 4 లేబర్ కోడ్ ను రద్దు చేయాలని, బీడీ పరిశ్రమపై పెట్టిన ఆంక్షలు ఎత్తివేయాలని, కార్మికుల పనిగంటలను పెంచుతూ కనీస వేతనం ఇవ్వకుండా కార్మికుల కోసం జరుగుతున్న జాతీయ సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్లయ్య, నాయకులు స్వామి, సిద్ధరాములు, బాబు, తదితరులు ఉన్నారు.
జాతీయ కార్మిక సమ్మెను జయప్రదం చేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES