నవతెలంగాణ ఆర్మూర్
పట్టణంలోని కోర్టులో నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ న్యాయమూర్తి శ్రీదేవి ను మంగళవారం వారి చాంబర్లో కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ ఆధ్వర్యంలో ఆత్మీయ స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలిపినారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ ప్రతినిధులు బాబాగౌడ్, లయన్ నివేదన్ గుజరాతి , అశోక్ శాలువ, పుష్ప గుచ్చంతో ఘనంగా సన్మానించి ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపినారు. న్యాయమూర్తి మాట్లాడుతూ ఇట్టి ఆర్గనైజేషన్ ద్వారా పలురకాల సామాజిక సేవా కార్యక్రమాలు, న్యాయ అవగాహన సదస్సులు చేపట్టాలని వారు పేర్కొన్నారు.
- Advertisement -