– ప్రశ్నించే వారికి పార్టీ అండగా ఉంటుంది
– మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి
నవతెలంగాణ – రామాయంపేట : సోషల్ మీడియా వేదికగా నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, హనుమంతరావులను ప్రశ్నించినందుకు మెదక్ జిల్లా, రామాయంపేట పోలీసులు కేసు నమోదు చేసిన బీఆర్ఎస్ నాయకులు చిట్టిమల్లి నరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ శ్రీకాంత్ సాగర్‌లకు మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి గారు అండగా నిలిచారు. కేసు నమోదు విషయం తెలుసుకున్న పద్మ దేవేందర్ రెడ్డి, బుధవారం రామాయంపేట బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఇరువురిని కలిసి, జరిగిన విషయంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా వారికి ధైర్యం చెబుతూ, ప్రశ్నించే వారికి దేనికైనా, పార్టీ మీకు అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రామాయంపేట మున్సిపల్ తొలి చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, పీఏసీసీ చైర్మన్ బాదే చంద్రం, నిజాంపేట మండల బిఆర్ఎస్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు ఉమామహేశ్వర్, బసన్నపల్లి రాజు యాదవ్, పోచమ్మల ఐలయ్య, భూమ మల్లేశం, కన్నాపురం కృష్ణ గౌడ్, చింతల రాములు, పోల్కం నాగార్జున, తదితరులు పాల్గొన్నారు.
నరేందర్ రెడ్డి, శ్రీకాంత్ సాగర్‌లకు బీఆర్ఎస్ భరోసా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES