Wednesday, July 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తిప్పారంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు 

తిప్పారంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు 

- Advertisement -

నవతెలంగాణ – గాంధారి : గాంధారి మండలంలోని తిప్పారం గ్రామంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు  ఘనంగా నిర్వహించారు.  బుధవారం స్థానిక గ్రామ సంఘం కార్యాలయంలోప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న ఏపీఏం  గంగరాజు  మాట్లాడుతూ.. మహిళలు బ్యాంకు నుంచి రుణాలు తీసుకొని  ఆర్థికఅభివృద్ధి చెందాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టిన ఇందిరమ్మ మహిళా శక్తి  సంబరాల్లో భాగంగా గ్రామంలో ఉన్న మహిళలందరూ సంఘంలో చేరాలని అన్నారు. బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలు వ్యాపార అభివృద్ధికి  ఉపయోగించుకోవాలన్నారు.

సంఘ సమావేశాలు సక్రమంగా నిర్వహించి ఆర్థిక లావాదేవీలు రికార్డులలో నమోదు చేయాలని కోరారు. ఈ సందర్భంగా సీసీ  భూమయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాపకంగా   చేపట్టిన ఇందిర మహిళా శక్తి సంబరాల కార్యక్రమం భాగంగా మహిళా సంఘాలకు లోను బీమా ప్రమాద బీమా  2029 వరకు అమలు చేస్తుందన్నారు. సభ్యురాలు మరణిస్తే లోను బీమా పథకం కింద  రూ.2 లక్షల వరకు, ప్రమాద బీమా కింద  రూ.10 లక్షలు. నామినీకి  చెల్లిస్తుందని తెలిపారు అదేవిధంగా వికలాంగుల సంఘాలు వృద్ధుల సంఘాలు  ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు నుండి తీసుకున్న వడ్డీ రాయితీ ఆరు మాసాలకు ప్రభుత్వము మంజూరు చేసింది అని  తెలిపారు ఈ కార్యక్రమంలో  గ్రామ సంఘం అధ్యక్షురాలు. సాయవ్వ  మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -