ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్ : బ్రిక్స్‌లో కొనసాగిన పక్షంలో భారత్ పైన కూడా పది శాతం అదనపు సుంకం విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. బ్రిక్స్‌ను స్థాపించిన ఐదు దేశాలలో భారత్ కూడా ఒకటి. ఇటీవల జరిగిన బ్రిక్స్ సదస్సు అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అమెరికా ఏకపక్షంగా సుంకాలు విధిస్తోందని, సుంకేతర చర్యలు చేపడుతోందని ఆరోపించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ ‘బ్రిక్స్‌లో ఉంటే భారత్‌పై 10 శాతం అదనపు సుంకాన్ని విధిస్తాం. ఎందుకంటే మమ్మల్ని దెబ్బతీయడానికే బ్రిక్స్ ఏర్పడింది. మా డాలరు విలువను తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. దానిని ప్రామాణికంగా తీసుకోకూడదని అంటోంది. వారు అలా చేయదలచుకుంటే ఓకే. నాకూ ఆట ఆడడం వచ్చు.
బ్రిక్స్‌లో ఎవరు ఉన్నప్పటికీ అదనంగా పది శాతం సుంకం చెల్లించాల్సి ఉంటుంది. భారత్ విషయంలోనూ అంతే. ఎలాంటి మినహాయింపులు ఉండవు’ అని స్పష్టం చేశారు. భారత్ గురించి, బ్రిక్స్ విడుదల చేసిన ప్రకటన గురించి విలేకరులు ప్రశ్నించగా డాలరును సవాలు చేయాలని అనుకునే దేశాలు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని బెదిరించారు. అయితే అందుకు వారు సిద్ధపడతారని తాను అనుకోవడం లేదని చెప్పారు. ‘నేను సంవత్సరం క్రితమే చెప్పాను. బ్రిక్స్ ముక్కలైపోయింది. అయితే ఇంకా కొందరు దానిని పట్టుకొని వేలాడుతున్నారు. నా ఉద్దేశంలో బ్రిక్స్ వల్ల పెద్ద ముప్పేమీ ఉండదు. అయితే వారు డాలరును నాశనం చేయాలని, తద్వారా దానిని ఏ దేశమూ ప్రామాణిక ంగా తీసుకోకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారు’ అని ట్రంప్ మండిపడ్డారు. కాగా వాణిజ్య ఒప్పందంపై భారత్, అమెరికా మధ్య జరుగుతున్న చర్చలు తుది దశకు చేరుకుంటున్న తరుణంలో ట్రంప్ ఈ బాంబు పేల్చారు.
బ్రిక్స్‌లో ఉంటే భారత్ పైనా అదనపు సుంకం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES