Thursday, July 10, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంనేడు విచారణకు రండి

నేడు విచారణకు రండి

- Advertisement -

– ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రభాకర్‌రావుకు మళ్లీ నోటీసులు
– ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను స్వాధీన పర్చుకున్న అధికారులు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్‌ఐబీ మాజీ ఓఎస్‌డీ ప్రభాకర్‌రావును గురువారం విచారణకు హాజరుకావాలని సిట్‌ అధికారులు బుధవారం నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఈ కేసులో ఐదు దఫాల పాటు ప్రభాకర్‌రావును సిట్‌ అధికారులు విచారించారు. తాజాగా, ఆయన సెల్‌ఫోన్‌, ట్యాప్‌టాప్‌లను అధికారులు స్వాధీనపర్చుకున్నారు. వాటిని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో విశ్లేషణ జరుపుతున్నారు. ల్యాప్‌టాప్‌తో పాటు ఆయన సెల్‌ఫోన్‌కు సంబంధించి 2023 డిసెంబర్‌ నుంచి 2024 నవంబర్‌ వరకు వాటి ద్వారా ప్రభాకర్‌రావు జరిపిన వ్యవహారాలపై కూపీ లాగుతున్నారు. వ్యాట్సాప్‌ చాటింగ్‌లు, మెసేజ్‌లు, ఫోన్‌కాల్స్‌పై అధికారులు దృష్టి కేంద్రీకరించి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇప్పటికే వీటిద్వారా ఫోన్‌ ట్యాపింగ్‌కు సంబంధించి ఏయే ప్రముఖులు, వ్యాపారులు, ప్రజాప్రతినిధులకు సంబం ధించిన ట్యాపింగ్‌ వ్యవహారాన్ని ప్రభాకర్‌రావు పర్యవేక్షించారనే విషయాన్ని సిట్‌ అధికారులు కూపీ లాగినట్టు తెలిసింది. ఇక, ఆయన కింది స్థాయి అధికారులు, బాధితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ఈమారు క్షణ్ణంగా ప్రభాకర్‌రావును విచారించడానికి అధికారులు సిద్ధమైనట్టు తెలిసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -