నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల జుక్కల్ గురువారం జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శ్రీ షేక్ సలాం గారు కళాశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ క్రమంలో అన్ని రికార్డులు, ఆఫీస్ రికార్డులు తనిఖీ చేయడం జరిగింది. అదేవిధంగా కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ ఎం మోహన్ రెడ్డి, శ్రీ షేక్ సలాం కళాశాల ఆవరణలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర బృందం, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ షేక్ సలాం గారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ .. డ్రగ్స్, ఇతర మాదకద్రవ్యాల బారిన పడోద్దని సూచించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు బి.రమేష్, పి.సాయిలు, జి.కుమారస్వామి, ఐ.వలిందర్, బి.సత్యం, ఫకీర్య నాయక్, జె.శ్రీధర్, జి.సౌజన్య, ఏ.నాగరాజ్, వి.నారాయణరావు, ఎస్.కళ్యాణి పాల్గొన్నారు.
ప్రభుత్వ జూ.కళాశాలలో ఆకస్మిక తనిఖీలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES