Friday, July 11, 2025
E-PAPER
Homeరంగారెడ్డిగచ్చిబౌలి మహిళా పీఎస్‌లో ఏసీబీ దాడులు

గచ్చిబౌలి మహిళా పీఎస్‌లో ఏసీబీ దాడులు

- Advertisement -

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్‌ఐ వేణు గోపాల్‌
నవతెలంగాణ-మియాపూర్‌

రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలి మహిళ పోలీసుస్టేషన్‌లో ఏబీసీ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్‌ఐ వేణుగోపాల్‌ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. సిటీ రేంజ్‌-1 ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఒక కుటుంబ కలహాల కేసు విషయంలో ఎస్‌ఐ వేణుగోపాల్‌ను సంప్రదించారు. సయోధ్య కుదుర్చడం కోసం ఎస్‌ఐ రూ.25వేలు లంచం ఇవ్వాలని కోరారు. దాంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. శుక్రవారం ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో గచ్చిబౌలి మహిళా పీఎస్‌లో సోదాలు నిర్వహించారు. లంచం తీసుకుంటుండగా ఎస్‌ఐని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కాగా, వేణుగోపాల్‌ ఇటీవలే ప్రమోషన్‌ పొంది ఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -