Saturday, July 12, 2025
E-PAPER
Homeసినిమా'జూనియర్‌' లక్ష్యం ఏంటి?

‘జూనియర్‌’ లక్ష్యం ఏంటి?

- Advertisement -

‘జూనియర్‌’ సినిమాతో కిరీటి రెడ్డి వెండితెర అరంగేట్రం చేస్తు న్నారు. టీజర్‌లో తన ఎనర్జిటిక్‌ పెర్ఫార్మెన్స్‌తో స్ట్రాంగ్‌ ఇంపాక్ట్‌ క్రియేట్‌ చేశారు. దీనికి రాధా కష్ణ దర్శకుడు. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మించారు. ఈనెల 18న ఈ సినిమా రిలీజ్‌ కానుంది. శుక్రవారం దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. అభిని తల్లిదండ్రులు చాలా గారభంగా చూసుకుంటారు. కాలేజ్‌కి వచ్చిన తర్వాత క్లాస్‌మేట్‌ స్పూర్తిని ప్రేమిస్తాడు. అప్పటి వరకు అభి జీవితం హ్యాపీగా, ఎలాంటి బాధ్యతలూ లేకుండా సాగుతుంది. కానీ, తన తండ్రి ఊరిలో ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్న తర్వాత జీవితం పూర్తిగా మారుతుంది. దర్శకుడు రాధాకష్ణ ఈ సినిమాలో యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, రొమాన్స్‌, మంచి ఎమోషన్స్‌ అన్నీ అద్భుతంగా బ్లెండ్‌ చేశారు. ఫాదర్‌-సన్‌ ఎమోషనల్‌ ట్రాక్‌, జెనీలియా పాత్ర, ఊరి బ్యాక్‌డ్రాప్‌ ఇవన్నీ కలిపి ఈ సినిమాను మాస్‌, క్లాస్‌ ఆడియన్స్‌కి నచ్చే కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా నిలబెట్టాయి.
శ్రీలీల తన స్క్రీన్‌ ప్రజెన్స్‌తో ఎనర్జీ తీసుకొచ్చారు. వైవా హర్ష, సత్యల కామెడీ టైమింగ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కిరీటి తండ్రిగా డాక్టర్‌ రవిచంద్రవి ఎమోషనల్‌ డెఫ్త్‌ తీసుకొచ్చారు. మొత్తానికి ట్రైలర్‌ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ని మరింత పెంచింది అని చిత్ర యూనిట్‌ పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -