– రాజ్యసభ సభ్యులు రేణుకా చౌదరి
నవతెలంగాణ-ఖమ్మం
మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ అందరికీ సమన్యాయం చేయాలనే ఉద్దేశంతో రిజర్వేషన్ కల్పించారని రాజ్యసభ సభ్యులు రేణుక చౌదరి అన్నారు. దాన్ని అమలుచేసేలా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పిస్తూ క్యాబినెట్‌లో నిర్ణయిం చడం చాలా సంతోషమంటూ సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలి పారు. శుక్రవారం ఖమ్మంలోని సంజీవరెడ్డి భవన్‌లో ఏర్పాటు చేసిన విలే కరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చెప్పిన విధంగానే సీఎం రేవంత్‌రెడ్డి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించినట్టు తెలిపారు. ఈ రిజర్వేషన్ బిల్లు ప్రకారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందన్నారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 33శాతం రిజర్వేషన్ అమలు తీసుకొస్తే, రాహుల్ గాంధీ నాయకత్వంలో 42 శాతం రిజర్వేషన్ తీసుకొచ్చామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ.. చేతి గుర్తు ప్రతిఒక్కరికీ అభయహస్తంగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీ గంటకొక మాట మాట్లాడు తుందని, కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలతో వాళ్లకు ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ఆరో గ్యంగా ఉంటేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని తెలిపారు. అల్లుడు.. బిడ్డ.. కొడుకు ఏం చేశారో రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అందరికీ సామాజిక న్యాయం చేస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ మానకొండ రాధ కిషోర్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరావు, మేయర్ నీరజ పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీలో అందరికీ సమన్యాయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES