గంజాయి ముఠా అరెస్టు…

నవతెలంగాణ- హైదరాబాద్:  భారీగా గంజాయి పట్టుబడింది.. గంజాయి తరలిస్తున్న రెండు అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనవారం ఉదయం రాచకొండ పోలీసులు తనిఖీలు నిర్వహించి అరుగురు గంజాయి ముఠాను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 270 కిలలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Spread the love