- Advertisement -
నవతెలంగాణ-బీర్కూర్ (నసురుల్లాబాద్)
చేపల వేటకు వెళ్లి ప్రమాదశాత్తూ నీటిలో మునిగి వ్యక్తి మృతి చెందిన ఘటన బీర్కూర్ మండలంలోని చించోలి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై రాములు కథనం ప్రకారం.. కిష్టాపూరానికి చెందిన ముక్కిడి సాయిలు (34) చెరువులో దిగి చేపల కోసం వల వేయగా.. ఆ వల తన కాలుకు చుట్టుకుంది. దీంతో నీటిలో మునిగి ఊపిరాడక మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు జాలర్ల సాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
- Advertisement -



