Sunday, July 13, 2025
E-PAPER
Homeజిల్లాలునిజామాబాద్ జర్నలిస్టులకు నివాసయోగ స్థలాలు 

నిజామాబాద్ జర్నలిస్టులకు నివాసయోగ స్థలాలు 

- Advertisement -

నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. భూపతిరెడ్డి
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
: నిజామాబాద్ నగరంలో పని చేస్తున్న జర్నలిస్టులకు నివాసయోగ్యమైన ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు సహకరిస్తానని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు శనివారం నాడు జర్నలిస్టు నాయకులు ఎమ్మెల్యే ను కలిశారు.

నగరానికి దూరంగా కాకుండా నగర పరిసరాలలో ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు..తన నియోజకవర్గ పరిధిలో అనువైన స్థలాలను గుర్తించి ఇండ్ల స్థలాలు ఇస్తామని ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాటిచ్చారు. 81 సర్వే నెంబరు స్థలాన్ని ఇవ్వాలని జర్నలిస్టులు కోరగా భూపతిరెడ్డి సానుకులాంగ స్పందించారు..అందరికీ ఇచ్చేందుకు వీలుగా నగర పొలిమేరలో ప్రభుత్వ ఖాళీ స్థలాలు గుర్తిస్తామని ఎమ్మెల్యే చెప్పారు.. ఆర్డీవో కు ఆదేశాలు ఇస్తామని ఆయన అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -