నవతెలంగాణ – జుక్కల్ : జుక్కల్ మండల కేంద్రంలో బాలాజీ టిఫిన్ సెంటర్ ను మాజీ ఎమ్మెల్యే హనుమాన్ షిండే శనివారం బీఆర్ఎస్ సీనీయర్ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ… చిన్న నాటి నుంచి ఆర్థిక స్వావలంబన కొరకు వివాహాల్లో వంటలు చేసి మంచి పేరు సాధించారని అన్నారు. ఆర్థికంగా బలపడాలనె ధృడ సంకల్పంతో, పట్టుదలతో ముందడుగు వేసి, టిఫిన్ సెంటర్ ప్రారంభానికి పూనుకున్నారని తెలిపారు. వ్యాపారంలో వృద్ధి చెందుతూ అంచెలంచెలుగా ఎదగాలని అన్నారు. అంతకుముందు టిఫిన్ సెంటర్ యజమాని ఎమ్మెల్యేతో పాటు సీనియర్ బీఆర్ఎస్ నాయకులను శాలువాతో సన్మానించి, సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు బీఆర్ఎస్ మండల స్థాయి నాయకులు నీలు పటేల్, వాస్రే రమేష్, విట్టు పటేల్, భాను గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
టిఫిన్ సెంటర్ ను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES