నవతెలంగాణ – రాయపర్తి : ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ మండలంలో ప్రతి ఒక్క బాధిత కుటుంబానికి అండగా నిలుస్తుంది. శనివారం ట్రస్ట్ ఫౌండర్ బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి మండలంలోని తిర్మలాయపల్లి గ్రామానికి చెందిన బరిగేలా నర్సయ్య మరణించగా 50 కేజీల బియ్యం, వంట నూనె సామాగ్రి అందజేశారు. తదుపరి ఏకే తండాకు చెందిన హలవత్ సూర్య నాయక్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి హన్మకొండ ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా పరామర్శించి రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
మండలంలో ప్రతి ఒక్క కుటుంబానికి తమ వంతు సహాయ సహకారాలు ఉంటాయని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి, పార్టీ మండల కార్యదర్శి పూస మధు, పిఎసిఎస్ డైరెక్టర్ దొంతరబోయిన యాదగిరి, నాయకులు గజావెల్లి ప్రసాద్, దోకుడు దేవేందర్, వశపాక కుమారస్వామి, వశపాక మారయ్య, వశపాక మల్లయ్య, వశపాక చిన్న యాకయ్య, దోకుడు సొమెందర్, హలవత్ రమేష్, మూడు రవీందర్, మాలోత్ వసుందర్, మునవత్ రవి, హలవత్ రమేష్, హలవత్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.