Sunday, July 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాధిత కుటుంబాలకు సునీల్ కుమార్ పరామర్శ

బాధిత కుటుంబాలకు సునీల్ కుమార్ పరామర్శ

- Advertisement -

నవతెలంగాణ – కమ్మర్ పల్లి : మండలంలోని వివిధ గ్రామాలలో పలు బాధిత కుటుంబాలను బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ శనివారం పరామర్శించారు. బషీరాబాద్ గ్రామానికి చెందిన చిలివేరి చిన్న గంగారం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బషీరాబాద్ గ్రామానికే చెందిన డిష్ శ్రీకాంత్ వాళ్ల అమ్మ గంగుబాయి ఇటీవల ఆనారోగ్యంతో  మరణించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు.

కోన సముందర్ గ్రామానికి చెందిన గణేష్ వల్ల నాన్న లక్ష్మీరాజారం ఇటీవల గుండెపోటుతో మరణించారు. వారి కుటుంబ సభ్యులను సునీల్ కుమార్ పరామర్శించారు. కోనసముందర్ గ్రామానికే చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుడిసె అంజమ్మ భర్త నారాయణ అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారిని పరామర్శించి, క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. గ్రామానికే చెందిన అజిజ్ పొట్టకూటి కోసం గల్ఫ్ దేశం దుబాయ్ వెళ్లి అక్కడ మరణించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చి ప్రభుత్వం తరఫున ఇచ్చే రూ.5లక్షల ఆర్థిక సహాయాన్ని అందించే విధంగా కృషి చేస్తానని కుటుంబ సభ్యులకు హామీనిచ్చారు.కార్యక్రమంలో కమ్మర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య, కిషన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పడిగేల ప్రవీణ్,  మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -