రవికె లేదా చోలీ భారతదేశంలో స్త్రీలు శరీరంపై భాగాన్ని వారికి తగిన విధంగా వస్త్రముతో కుట్టబడి ఉపయోగించేది. చరిత్ర చూసుకుంటే రవిక కట్టుకోవడానికి కన్యాకుమారి లో ఒక యుద్ధమే చెయ్యాల్సి వచ్చింది. దాని కోసం పన్ను లు కూడా వేశారు …
భారతీయ ఆచార కట్టుబాట్లు గురించి మాట్లాడుకుంటే చీర/ రవిక చాలా ప్రాధాన్యం ఉంది అని చెప్పొచ్చు. అది ఒక కేవలం ఒక వస్త్రమే కాదు స్త్రీ తన మాన రక్షణకి కవచంగా భావిస్తుంది అయితే అలాంటి రవికని ధరించడం పాపం గాను, నేరం గాను చాలా తెగలలో/ పాత తరపు బ్రాహ్మణ కుటుంబాలలో ఉండేది. రవిక, ఆచారం చుట్టూ జరిగిన దుర్మార్గపు అణిచివేత గురించి రాసిన మోనోలోగ్ ఈ ‘రవిక’ కవితా సంపుటి ..రేణుక అయోల గతంలో కూడా మంచి ఆలోచింపచేసే కవిత్వాన్ని వెలువరించారు. సాధారణంగా కవితా సంపుటి పంధాలో వెళ్లకుండ ఒక కొత్త ఒరవడి (మోనోలోగ్) స్వగతం లాంటి సంభాషణ తో లోకానికి ఒక కథలా చెప్తున్నారు.
అవ్వడానికి స్త్రీవాద కవిత్వం అయినా ఈ సంపుటిలో అన్ని అంశాలని స్పశించడం గొప్పగా అనిపిస్తుంది. ఆచారం పేరుతో జరుగుతన్న అణిచివేతని లోకానికి చూపించి ఇది మా పరిస్థితి వినండి అని బహిరంగంగా సమాజాన్ని నిలదీస్తుంది.
(bవష్ట్రaఙఱశీతీ ర్yశ్రీవ) ప్రవర్తన శైలి ఒక వ్యక్తి ప్రత్యేకంగా కనపరిచే ప్రవర్తన రీతి… బాహ్య ప్రపంచం శరీరానికి వెలుపల ఉన్న భౌతిక ప్రపంచం.
ఆత్మలో భాగాలూ, అంశాలు గాని సమస్త సంఘటనలు వస్తువులు… ప్రధాన కవితలో ఇలా ధిక్కార పతాకంగా పెట్టెలో దాచుకున్న రవిక యెదని హత్తుకున్నాక/ తెల్ల గన్నేరులా ఉంది./ పెట్టుకున్న గుండీలు చూపులన్నిటిని పేల్చేసే మిషన్ గన్నులా ఉంది /పమిట అటు ఇటు తొలిగినా/ గుండెల కథలకి భద్రత నిచ్చే ఇనుప తలుపులా ఉంది/ .కట్టుకున్న వంతెనలా ఉంది/ ఊరికే చేతులు తగిలించడానికి అడ్డు పడే కత్తిపీటాలా ఉంది (నగ భుజాలు) ..
ఇది పరిశీలిస్తే రవిక కేవలం ఒక అలంకారానికి మాత్రమే కాదు మగవాడి చెడు దృష్టి చూపు నుంచి రక్షణ కూడా.
ఇది ఒక పరా వాచిక భాషణం
ఇతరులకి వినపడని భాషణం …మోనో లాగ్. లాంటిది తనలో తనకు అంతరిక సంభాషణ. ఇది స్త్రీ తనకి తాను చెప్పుకుంటున్న అంతరింగిక సంభాషణ మనము వినాలి అని తపన పడుతుంది. స్త్రీల కోసమే పుట్టిన ఆచారాలు స్త్రీని వేధించినా కూడా తప్పలేదు అందులో ‘వైధవ్యం’ ఒకటి పురాతన కాలం లో భర్త చనిపోతే భార్యని కూడా సతీ సహగమనం చెయ్యమనేవారు. వైధవ్యం ఎంత నరకమో అనుభవించిన వారికే తెలుస్తుంది. బాల్య వివాహంలో మొగుడు పోతే జరిపే తంతుకి ఒళ్లు జలదరిస్తుంది.
”ఆమెకి ఇరవై ఏళ్ళ తేడాతో తాళి కట్టిన వాడు ముసలివాడు చనిపోక ఉట్టి కట్టుకొని ఉండిపోతాడా?/ నువ్వు స్త్రీ అనుక్షణం గుర్తు తెచ్చే నిప్పుకి ఒక ఆజ్యం/ అనుక్షణం సిద్ధంగా ఉంటూనే ఉంది ”నిజమే .. ప్రతీసారి మొగుడు పోయిన ఆడది అని ఈ సమాజం సూటి పోటీ మాటలతో హింసిస్తుంది. భార్య అనే తప్ప, స్త్రీ గా తనకి ఏ మాత్రం స్వతంత్రం లేని బతుకు కదా. ‘ఖాళీ నుదురు’ని చూసే ఈ సమాజం స్త్రీకి ఉన్నత స్థానం ఇస్తుంది ఎంత దారుణం కదా…
ఇంకో చోట ఇలా : పరికిణి మీద పూసిన నక్షత్రాలు మాయం అవుతుంటే/ నీలం ఎరుపు వోణి రంగులు వెలిసిపోతూనే పట్టుకొని తెచ్చుకోవాలి అనే అల్లరి ఊహకి గొళ్ళెం వేసుకోవాలి/… ఇదంతా అలంకారంకి సంబంధించింది నిన్నటి దాకా వొంటి మీద ఉన్న అలంకారం కేవలం ఆచారం పేరుతో దూరం చెయ్యడం బాధాకరం.
పరీక్షా ప్రవర్తన పరిశీలన (Observation of Test behavior) పరివర్తనా రీతులని పరిశీలించడం… తానూ ఏ సమూహం .నుంచి వచ్చారో అదే సమాజంలోని ప్రవర్ధనని… ఆచారాల పేరుతో స్త్రీల మనోబలాన్ని తగ్గించే పద్ధతులని పరిశీలించి ఇది సరి కాదు అని బాధితుల వైపు నుంచి మాట్లాడారు కవయిత్రి. ఇప్పటికి బ్రాహ్మణ సమాజంలో పాటించే ఆచారాలు కాస్త అయినా పరివర్తన వచ్చాయి ఏమో గాని ఒక రెండు మూడు తరాల ముందు ఆచారాలు చూస్తే భయం వేస్తుంది.
స్త్రీలు తమని తాము రక్షించుకోవాలి అని సమస్య నుంచి దూరం గా పారిపోకుండా పోరాడాలి అని మొదటి నుంచి బలంగా చెప్తారు ఈ కవయిత్రి. పలాయన వాదం చాలమంది సమస్య లనుంచి దూరంగా పారిపోతారు బహుశా తాము ఈ వ్యవస్థ ని ఏమి చేయలేము అని కావొచ్చు …కానీ అందరిలా వీరు తప్పించుకోకుండా ఎదురొడ్డి తన అక్షరాలని చై తన్య ప్రతీకలు గా నిలిపారు
తన సమూహంలో జరుగుతున్న/ జరిగిన ఆచారం పేరుతో జరిగిన దారుణాల్ని కవిత్వంగా మలిచారు. అయితే ఇందులో ఎక్కడ కూడా నాటకీకరణ కనిపించదు.
మనిషిని బట్టి కాక రంగుని చూసి గౌరవించే సమాజంలో తెలుపు ఎందరి జీవితంలో కారు మబ్బులు కమ్మేశాయి ఇదిగో చర్మం రంగు స్ట్రీల మనసుని ఎంతగా గాయపరించిందో… నల్లగా ఉండడం కూడా నేరమే
”ఆమె నలుపు ద్వేషం రంగస్థలం మీద తెల్లటి తెరలు చించి వ్యక్తిత్వాన్ని బయటపెట్టి/
తెల్లటి సమాజానికి చీకటి విలువ నేర్పుతూ నన్ను ఊపిరి పీల్చుకోనివ్వండి అంటూనే బ్లాక్ బ్యూటీ విజయాన్ని సాధించింది. (రంగు దోపిడీ ).
సాధారణంగా కవిత్వంలో కానీ, కథలో కానీ సమస్యని చూపిస్తారు పరిష్కారం పాఠకులకు వదిలేస్తారు. కానీ ఈ కవితల్లో సమస్యని దానికి ఎదుర్కొన్న ధైర్యం రెండూ చూడొచ్చు. ఇది మనల్ని బాగా ఆకట్టుకుంటుంది.
పెళ్లి ఒకప్పుడు బాగుండేది ఇప్పుడు పెళ్లి పేరుతో విధ్వంసమే .. పెళ్లిలో ఉన్న అణిచివేతని హింసకి భయపడే ఇప్పటి తరం సహజీవనం వేపు అడుగులు వేస్తున్నారా? ఒక వైపుగా ఆలోచిస్తే ఇది నిజమే. పెళ్లి అంటే ‘ఒప్పందం’ ఆర్థికంగా కావొచ్చు సామాజిక మైనా ఒక అవసరం అయినా కావొచ్చు…
శరీరంలో ఏ భాగమైనా ఎవరి కళలకైనా దారి చూపిస్తుంది. అంటే/ క్షణకాలం సానుభూతి ఊగిసలాడుతుంది/ మరుక్షణమే దుఃఖం పొంగి ముఖాన్ని నదికి చేస్తుంది. ”ఆమె కడుపు కోత కనిపించనివ్వకుండా /దయగల తల్లి అవతారం ఎత్తింది..ఇంకెవరో బతికే ఉన్నారు/ ఎక్కడో మన కడుపు తీపి శ్వాస తీసుకుంది…” ఇలా ఒక కవిత రావడం కన్నీళ్లు తెప్పిస్తుంది.
సినీ తారల జీవితం బయిటికి కనిపించేంత అందంగా ఏమి ఉండదు. వ్యక్తిగత జీవితాల్లో చొరబడే జాతకాల రాయుళ్ల వలన ఆమె ఎంతలా బాధపడింది వేదించబడిందో ‘కెమెరా కన్ను కింద’ ఎన్ని సంఘర్షణలో. ”ఆమెని వీధిన పడేసిన జాతకాల బలహీన సమాజం/ షాపుల ముందు గాల్లో చేతులు ఊపే రబ్బరు బొమ్మై ఊగుతూ, పిలుస్తూ నిల్చోవడం ఆమెకి నచ్చలేదు… ఆమె ప్రేమ పెళ్లిని జాతక హోమంలో వేసి/ ఆమెని లోయలోకి తోసేసిన రాజకీయాన్ని నిలిపేసిన కాగితం లాంటి ముఖాలన్ని చూడాలని అనుకోవడం లేదు”
ఈ కవితా సంపుటిలో రవిక కోసం చేసిన యుద్ధం ప్రతి పంక్తిలో/ ప్రతి కవితలో గోచరిస్తుంది. రవిక అలంకరణ కిందకి వస్తుందా? ఆచ్చాదన కిందికి వస్తుందా అనేది సందేహమే…
ఎర్రమట్టి గాజులు, మూడో మనిషి, పథ లాంటి కవితా సంపుటాలు వేసిన రేణుక ఈ రవికలో వ్యక్తీకరణ చాలా బలంగా ఉంది. అనుభవానికి/ అనుభూతికి అక్షరాలని అందించిన తీరుకి ఆశ్చర్యం. ఈ దీర్ఘ కవితలో ప్రెసెంట్ చేసిన విధానం చాలా కొత్తగా అనిపించింది. స్త్రీలని వస్తువులుగా భావించే సంస్కతి నుంచి విడుదల కావాలని ఈ కవిత్వంతో కొంతమంది అయినా ఆలోచింప చేయాలనీ కవయిత్రి బలంగా కోరుకుంటున్నారు. ఈ కవిత్వం చాలా మందిని కదిలిస్తుంది. అందులో సందేహం లేదు.
– పుష్యమీ సాగర్, 7997072896
గుండె చప్పుడు వినమంటున్న ‘రవిక’
- Advertisement -
- Advertisement -