సాహిత్య స‌మాచారం

ఆత్మీయ సభ
ప్రముఖ కవి, రచయిత బుర్రా లక్ష్మీనారాయణ సంస్మరణార్థం ఆత్మీయ సభ ఏప్రిల్‌ 15న తేదీ సాయంత్రం 6.00 గంటలకు సుందరయ్య కళా నిలయంలోని షోయబ్‌ హాల్‌లో జరుగుతుంది. ఈ సభలో డాక్టర్‌ రూప్‌ కుమార్‌ డబ్బీకార్‌, కె.వి.ఎస్‌. వర్మ, ఏనుగు నరసింహారెడ్డి, ఎం. నారాయణశర్మ, ఒద్దిరాజు ప్రవీణ్‌ కుమార్‌, గుడిపాటి ప్రసంగిస్తారు.

‘అనుమంద్రం’ ఆవిష్కరణ సభ
రాళ్లబండి శశిశ్రీ కవితాసంపుటి ‘అనుమంద్రం’ ఆవిష్కరణ సభ ఈ నెల 17వ తేదీ సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాల్లో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి తల్లావజ్జుల శివాజీ, కవి యాకూబ్‌, అనిల్‌ డ్యాని, మామిడి హరికృష్ణ, అంబటి సురేంద్రరాజు, ఘంటశాల నిర్మల, కవివాగ్గేయ సిద్ధార్థ, సత్యవాణి హాజరవుతారు.

‘హోరుగాలి’ పుస్తకావిష్కరణ
కె.శాంతారావు ‘హోరుగాలి’ పుస్తకావిష్కరణ ఈ నెల 20వ తేదీ సాయంత్రం 6 గంటలకు సుందరయ్య విజ్ఞానకేంద్రం, బాగ్‌లింగంపల్లిలో జరుగుతుంది. ఈ సభలో కె.ఆనందాచారి, నిఖిలేశ్వర్‌, ఎన్‌.వేణుగోపాల్‌, ఆర్‌.సుధాభాస్కర్‌, కె.శాంతారావు పాల్గొంటారు.

డా|| ఏనుగు నరసింహా రెడ్డి సాహిత్యంపై సమాలోచన
ఈనెల14 న నల్లగొండలోని NG కళాశాలలో డా|| ఏనుగు నరసింహా రెడ్డి సాహిత్యంపై సమాలోచన ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. మూడు సెషన్లుగా జరిగే ఈ సభలో ‘తెరిపిలేని వాన’ వ్యాస సంకలన పుస్తకావిష్కరణ, ‘ఏనుగు నరసింహారెడ్డి కవిత్వానుశీలనం, ఏనుగు నరసింహా రెడ్డి అనువాదాలు – పరిశీలన, ‘ఏనుగు నరసింహారెడ్డి విమర్శ దక్పథం’ అనే అంశాలపై ఉపన్యాసాలు ఉంటాయి. వక్తలుగా డా.పోరెడ్డి రంగయ్య, ఎలికట్టె శంకర్‌రావు, గుడిపాటి, డా.సుంకిరెడ్డి నారాయణరెడ్డి, డా. యం.పురుషోత్తమాచార్య, డా.ఎస్‌. రఘు, మేరెడ్డి యాదగిరి రెడ్డి, డా.తండు కష్ణ కౌండిన్య పాల్గొంటారు.
సజన సాహితి – నల్లగొండ

Spread the love