Monday, July 14, 2025
E-PAPER
Homeదర్వాజనిత్య ఎత్తి పోతల పథకం...

నిత్య ఎత్తి పోతల పథకం…

- Advertisement -

ఎప్పడిది అప్పుడు ఎత్తి పోయకుంటే
గుండె నిండా గుబులు పేరుకు పోతుంది కదా
కొత్త బాధలకు కొంత
చోటు చేయడం కూడా బాధ్యతే
గాజా పసికూనలను
రక్త పొత్తిల్ల లో చూసి
పహల్గామ్‌ భర్త శవం ముందు భార్య రోదన
కర్రె గుట్ట ఎర్ర గుట్ట అమరుల త్యాగాల కుప్ప
కళ్ల ముందు గిర్రున ఘోరాలు జరుగుతుంటే
మనం ఏం చేస్తాం ఏడవడం తప్ప
రోత పెట్టే రీల్స్‌ రింగు రింగు లా కళ్ళు పాడు
పాత కక్షలు మళ్ళీ తోడే కల్తీ కథల పోస్టులు
సెలబ్రిటీ సింపిరి బట్టల రీల్‌ షో లు
సంస్కత్తి సంప్రదాయాలు గ్రహణం పడుతుంటే
మనం ఏం చేస్తాం ఏడవడం తప్ప..
నైతికత లేని నాయకుల మైకు ముందు నాటకం
తిట్టు కోవడం ఆవలక్షణంగా
టీవీ చర్చల హల్‌ చల్‌
ఓటు వేసిన పాపానికి ప్రతి బుక్క కు పన్ను
బుల్‌ డోజర్‌ ప్రజాస్వామ్యం
ప్రకాశం కోల్పోతున్న వైనం
మనం ఏం చేస్తాం ఏడవడం తప్ప..
యుద్ధం ఆగిపోవడం కూడా అసంతప్తే జనానికి
శవాల శాడిజం ఇప్పుడు మనుషుల నిండా
ఏదో ఒక సమస్య లేకపోవడం కూడా పెద్ద సమస్యే
ఏ మహాత్ముడు ఇక మళ్ళీ రానప్పుడు
మనం ఏం చేస్తాం ఏడవడం తప్ప..
బాధను ఎప్పటికి అప్పుడు ఎత్తి పొసే పథకం
బావురు మని నిరసనను పూడ్చి పెట్టడం
లేకుంటే గన్ను పట్టుకొమ్మని గుండె ఒకటే నస…..
– దాసరి మోహన్‌, 9985309080

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -